- దేశంలో ధనిక ఏపి సీఎం జగన్
- కంగ్రాట్స్ తెలిపిన జనసేన పార్టీ
- ఎన్ని అబద్ధాలు చెప్పినా వైసీపీ మాట జనం నమ్మరన్న జన సైనికులు
తిరుపతి : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా ధనిక సియం జాబితాలో చేరి తన పరపతిని పెంచుకున్నాడే గానీ.., ఆయన వల్ల రాష్ట్రానికి వరిగిందేమి లేదన్నారు జనసేన పార్టీ నాయకులు. ఆస్థులు జగన్ కి…! అప్పులు ప్రజలకా…!! అంటూ నిలదీశారు. బహిరంగ సభల్లో ఆయన ఎన్నికల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మేపరిస్థితుల్లో లేరన్నారు. తాను నిరుపేద ముఖ్యమంత్రి అని స్వయంగా ప్రకటించుకున్న ఏపీ సీఎం, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించిన జాబితా ద్వారా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం తిరుపతి జనసేన పార్టీ నాయకులు స్పందించారు. కంగ్రాట్స్ సి.యం జగన్ గారు అంటూ ఓ హ్యాస్ ట్యాగ్ను విడుదల చేసారు. అనంతరం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు. మొన్న జరిగిన ఓ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఆస్తులు ఏమీ లేవని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు కావాలని తనపై అక్రమ కేసులు బనాయించి, తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగాననీ.., ఏపికి సేవ చేస్తున్న తనను తెలుగు ప్రజలు ఆదరించాలని, మీ బిడ్డగా హక్కును చేర్చుకోవాలని జగన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. ఆయనకున్న ఆస్తులతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించవచ్చని.., అలాగే ప్రజల బాధలను తొలగించవచ్చునన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను పెంచుకుంటున్నాడే గానీ.., ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం అప్పులు తెస్తూ.., ఆ రుణాలను ప్రజలపై మోపుతున్నారనీ.., ఇంతకంటే రాష్ట్ర అభివృద్ధి.., ప్రజా సంక్షేమం ఎక్కడ కనిపించకపోవడం శోచనీయమన్నారు.
సీఎం జగన్ తాను పోగేసిన సొమ్ముతోపాటు బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, సీఎంగా తాను సంపాదించిన అవినీతి డబ్బులతో ఆంధ్రప్రదేశ్ అప్పులు , ప్రజల బాధలను తీర్చేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వ్యవహార శైలి గజినీ సినిమాలో నటించిన హీరో నటనను తలపిస్తుందన్నారు. జగనే మా నమ్మకం అని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైసీపీ నాయకులు..,ధనిక సియంగా ముద్రవేసుకున్న జగన్ మోహన్ రెడ్డికి కంగ్రాట్స్ సీఎం అంటూ పోస్టర్లు ఎందుకు అంటించురు అని ప్రశ్నించారు. జగనన్న వింత పోకడలతో మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు విసుగు చెందుతున్న విషయాన్ని ఏపీ సీఎం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి పిక్ స్టేజికి వెళ్ళందని ఎద్దావ చేశారు. భవిష్యత్తులో జగనన్న బొట్టు పథకాన్ని తీసుకొచ్చినా.., ఆశ్చర్యపోవలసిన అక్కర్లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కోరికపోయినా.., ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనిక సియంగా ఖ్యాతి గడించడం తమకు గర్వంగా ఉందనీ.., ఈ విషయాన్ని పక్క రాష్ట్రాలకు సైతం గర్వంగా ప్రచారం చేస్తామన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలని, ఆ పార్టీ నాయకులకు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హుందాగా వ్యవహరించకపోతే 2024లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసులకు జనసేన పార్టీ భయపడదని, ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందన్నారు. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరులో మార్పు రాకపోతే.., లక్ష కోట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చందాలు ఇద్దామనే విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడదామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ,రాజారెడ్డి, బాబ్జి, కీర్తన, విజయ రెడ్డి, హేమ కుమార్, కొండ రాజమోహన్, మునుస్వామి, రాజేష్ ఆచారి, కిరణ్, మనోజ్, హేమంత్, బాలాజీ, పురుషోత్తం, సాయి, రాజేష్, ముత్యాలు మరియు రాష్ట్ర, జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.