కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని పంటలు సమృద్ధిగా పండాలని రైతు కళ్ళల్లో సంతోషం ఎల్లప్పుడూ ఉండాలని ఆ భక్త మార్కండేయ స్వామిని కోరుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. రైతు బాగుంటేనే గ్రామంలో మిగతా ప్రజలంతా సంతోషంగా ఉంటారని రైతు పంటలు సమృద్ధిగా పండిస్తేనే మిగతా వ్యవస్థ, రవాణా రంగం, వస్తువుల అమ్మకాలు కొనుగోలు మరియు ప్రతి ఒక్క కులవృత్తులకు పని రైతు కల్పిస్తాడని అంతా సక్రమంగా నడుస్తుందని ఆయన తెలియజేశారు, ఈకార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న, మహిళా విభాగం మండల అధ్యక్షులు కుసుంబ నవీన, ఎంపిటిసి గూడెల్లి ఆంజనేయులు, పిఏసీఎస్ డైరెక్టర్ అటికం రవి గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనుమాండ్ల శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షులు మాంకాళి ప్రభాకర్, సీనియర్ నాయకులు తాడూరి వెంకటరమణారెడ్డి, అనుమాండ్ల మల్లేశం,గీకురు ఆంజనేయులు, మాజీ పాక్స్ డైరెక్టర్ గొల్లపల్లి రవి, మైలారం గ్రామ శాఖ అధ్యక్షులు నూకల తిరుపతి, యాదవ సంఘం ఉపాధ్యక్షులు మర్రి వెంకటమల్లు, పద్మశాలి కులసంఘ పెద్దలు మరియు నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.