- జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 10 జీపీఏ , 9 జీపీఏ ఉత్తీర్ణత
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 68 మంది విద్యార్థులకు గాను 68 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 10 జీపీఏ ఇద్దరూ విద్యార్థులు బండి శ్రావ్య , బి.మహేందర్ లు సాధించారు. 9 జీపీఏ దాటిన విద్యార్థులు 24 మంది. వీరిని గ్రామ సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనవేని మల్లేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర సుమలత ఉపాధ్యాయులు అభినందించారు.