కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన పంతాంగి శ్రీనివాస్ గౌడ్ జీవనోపాధి కొరకు గల్ఫ్ లో కార్మికుడి గా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అనారోగ్యం చెంది స్వగ్రామానికి వచ్చారు. ఇటీవల అనారోగ్యం తో మరణించగా మంగళవారం జంగపల్లి గల్ఫ్ సేవా సమితి అధ్యక్షులు రంగు కనకయ్య గౌడ్ అధ్వర్యంలో వారి కుటుంబానికి 50 కేజీ ల బియ్యం రూ. 2500 ఆర్థిక సహాయం కమిటీ సభ్యులు చేతుల మీదుగా అందజేశారు, వారి కుటుంబానికి అధ్యక్షులు రంగు కనుకయ్య గౌడ్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం సంపూర్ణ ఎన్.ఆర్.ఐ పాలసీ అమలు చేసి, మృతుడి కుటుంబానికి 10లక్షలు మృతదన సహాయం అందించాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో తాడురి వంశీ కృష్ణ రెడ్డి, చింతల శ్రీనివాస్, కోతి రమేష్, రేవోజు చారి, రాపోలు చంద్రయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
