వైసీపీలోని మాదిగ ప్రజా ప్రతినిధులు సొంత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని… మాదిగలకు వారు చేసిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. మాదిగ కార్పొరేషన్ కు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ముందడుగు పథకం అడ్రస్ లేదని, లిడ్ క్యాప్ ఉందో, లేదో తెలియదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన డప్పు, చెప్పు, చర్మకార పింఛన్లు తప్ప… కొత్తగా ఎవరికీ పింఛన్లు ఇవ్వలేదని అన్నారు.
చంద్రబాబు హయాంలోనే మాదిగలకు మేలు జరిగిందని… వైసీపీ ప్రభత్వం వచ్చిన తర్వాత మాదిగలను పూర్తిగా గాలికొదిలేశారని జవహర్ మండిపడ్డారు. మాదిగల పరిస్థితి ఇంత దయనీయంగా ఎప్పుడూ లేదని చెప్పారు. మాదిగలకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగ ఆత్మీయ సమ్మేళనం పేరుతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.