గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ ఇదే రోజున (మే 30) ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ సోషల్ మీడియాలో స్పందించారు.
దేవుడి దయ, ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజున తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికీ మంచి చేశామని తెలిపారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న తమ ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తుందని, సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని స్పష్టం చేశారు.