జగిత్యాల జిల్లా – మల్లాపూర్ మండలం వేంపల్లి లో వెల్మల రమేశ్ ఉపాధికోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి.. ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా భర్త రమేష్ భార్యను గోడకేసి కొట్టడంతో తలపై బలంగా తాకడంతో భార్య సునీత(26) అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు భర్త రమేశ్ పరారీలో ఉన్నట్టు సమాచారం. తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.