- క్రీడాకారులకు అండగా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్
- జిమ్నాస్టిక్స్ అసోసియేషన్అధ్యక్షులు డాక్టర్ వై ప్రవీణ్, కార్యదర్శి ఆర్ శ్రీధర్.
తిరుపతి: ప్రతిభ కలిగిన క్రీడాకారులకు జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని ఆ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వై ప్రవీణ్, కార్యదర్శి ఆర్ శ్రీధర్ అన్నారు. తిరుపతి జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిమ్నాస్టిక్స్ .., అలాగే తిరుపతి జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీలు తిరుపతి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ పర్యవేక్షణలో సోమవారం తిరుపతిలోని యూత్ హాస్టల్లో నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని..,తమ ప్రతిభను చాటారు.ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వై ప్రవీణ్, కార్యదర్శి ఆర్ శ్రీధర్, గౌరవ అతిథులుగా ఆర్పీఎఫ్ సి మధుసూదన్, ఎస్ సుబ్బరాయుడు , బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ ఈశ్వర ప్రసాద్, జిమ్నాస్టిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ వి శివప్రసాద్, పాట్రన్ వైఎస్ బాబు, పి జయ శేఖర్ పాల్గొని విజేతలకు ట్రోఫీల్డ్తో పాటు, మెడల్స్ని అందజేసి,వారి క్రీడాస్పూర్తిని కొనియాడారు. జిమ్నాస్టిక్స్ జిల్లా విజేతగా బాలుర విభాగంలో ఎం వంశీ, బాలికల విభాగంలో స్విమ్స్లో బిఎస్సి నర్సింగ్ మూడవ సంవత్సరం చదివే విద్యార్థిని బండి చైతన్య ఛాంపియన్స్గా నిలిచారు .బాడీ బిల్డింగ్ పోటీలలో 55 కేజీల విభాగంలో మనీ ,75 కేజీల విభాగంలో జె రవి ,80 కేజీల విభాగంలో మొహుద్దీన్ ఛాంపియన్లుగా నిలిచారు. అనంతరం జరిగిన చాంపియన్ ఆఫ్ ఛాంపియన్ పోటీలలో జే రవి కైవసం చేసుకున్నారు .ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు శ్రీకాకుళం జిల్లాలో పార్వతిపురంలో జరగబోయే రాష్ట్ర క్లాసిక్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొననున్నారు.