అల్లూరి జిల్లా, అరకువాలీ,ది రిపోర్టర్ : అరకువేలిలో ప్రభుత్వ అను బంధ పారిశ్రామిక శిక్షణ సంస్థ కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు, ఈ జాబ్ మేళా ను ఏపీఎస్ఎస్డిసి అధ్వర్యంలో జరిగిన డిఎస్డిటీకి సంభందించిన పలుకంపెనీలకు నిరుద్యోగులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గోన్నారు. అందులో భాగంగా అక్కడ నిరుద్యోగులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక చాలా ఇబ్బందులకు గురయ్యారు. గవర్నమెంట్ వాళ్ళు ఇంత వ్యయం ఖర్చు పెట్టి చేస్తుంటే కనీసం బయట కూర్చోవడానికి కుర్చీలు, తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితీ ఉందని నిరుద్యోగులు వాపోయారు.
