తెలంగాణ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు వెలువడగా… తాజాగా బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
తాజా నోటిఫికేషన్‌లో భర్తీ కానున్న పోస్టుల వివరాల్లోకి వెళితే… అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు 751, ట్యూటర్ పోస్టులు 357, అసిస్టెంట్ సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు 211, అసిస్టెంట్ సివిల్ సర్జన్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్టులు 7 ఉన్నాయి. వీటి కోసం అభ్యర్థులు జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.