ఆంధ్రప్రదేశ్ , పల్నాడులోని రోడ్లు అండ్ భవనాల శాఖ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీసు సబార్డినేట్, శానిటరీ వర్కర్, వాచ్‌మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణత, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 2వరకు దరఖాస్తులు సంబంధిత చిరునామాలో సమర్పించాలి.
- ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
- ఖాళీల సంఖ్య: 21 పోస్టులు
సబ్ డివిజన్ వారీగా ఖాళీలు..
1. సత్తెనపల్లి:
03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
2. వినుకొండ:
వినుకొండ: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
కారెంపూడి: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
3. మాచర్ల:
మాచర్ల: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
గురజాల: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
దాచేపల్లి: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
పిడుగురాళ్ల: 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 01, అటెండర్- 01) పోస్టులు
ఆఫీసు సబార్డినేట్: 07 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
- శానిటరీ వర్కర్: 07 పోస్టులు
అర్హత: నిబంధనల ప్రకారం
వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
- వాచ్‌మెన్: 07 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ మెడికల్ అధికారులు జారీ చేసిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది
వేతనం: నెలకు రూ.15000.
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..
- పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.
- సంబంధిత పోస్ట్ కోసం నిర్దేశించిన ఉత్తీర్ణత సర్టిఫికేట్‌లు
- అన్ని సంవత్సరాల అర్హత పరీక్ష లేదా దానికి సమానమైన మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి.
- 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.
- లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.
- లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
- దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).
- సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు.
- ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.03.2024.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
District (R&B)Engineering Officer,
Prakash Nagar, Palnadu District,
Narasaraopet – 522601.