కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఇటీవల అకాల వర్షాల తో వరి ,మొక్కజొన్న, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలను ఈ రోజు జాయింట్ కలెక్టర్ (ట్రైనీ) నవీన్ నికోలాస్, మండలంలోని గునుకుల కొండాపూర్, జంగపల్లి,మాదాపూర్, వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి వర్షానికి తడిసిన వడ్లని, మొక్కజొన్న, వరి పొలాలను పరిశీలించారు, జాయింట్ కలెక్టర్ తో పాటు రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, ఎమ్మార్వో అనంతరెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఆర్ఐ రజిని కుమార్, ఏఈఓ సౌమ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు