- వాస్తవాలు ప్రచురించినందుకు ప్రజాజ్యోతి రిపోర్టర్, దళిత జర్నలిస్ట్ వెంకటేష్ పైన హత్యాయత్నం
- రేషన్ బియ్యం అక్రమ రవాణా పై వాస్తవాలు బయటపెట్టినందుకే దాడి
- దాడిలో పాల్గొన్న ఇద్దరు బియ్యం దందా అనుచరులని అనుమానం
- దాడికి ప్రధాన సూత్రధారి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ప్రధాన అనుచరుడు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పై అనుమానం
- ప్రజాపాలన అంటే దాడులు కేసులా…?
రాష్ట్రంలో భావప్రకటనా స్వేచ్ఛ లేదు.. మీడియాకు స్వాతంత్ర్యమే లేదన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ప్రజాజ్యోతి లో పని చేస్తున్న జర్నలిస్ట్ వెంకటేష్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు దాడి చేశారు. గత కొన్నాల్లుగా జరుగుతున్న అక్రమ బియ్యం దందా విరప్పన్ పై వార్తా రాసినందుకు దాడి చేసారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా దాడులు మొదలయ్యాయనడానికి ఈ దాడి మరో నిదర్శనం. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.