contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జర్నలిస్టుల ఊసేలేని ఉత్సవాలు…

  • జర్నలిస్టుల ఊసేలేని ఉత్సవాలు.
  • తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిస్టులు ఎక్కడ ?
  • నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లో మీ ఉద్యమానికి ఊపిరి పోసినవారు కలం కార్మికులు కాదా ?
  • ఈ దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిస్ట్ ల పై చిన్నచూపు ఎలా..
  • పట్టించుకోని ప్రజా ప్రతినిధులు..అధికారులు.
  • ప్రభుత్వానికి, ప్రజలకి వారధి గా పనిచేస్తూన పాత్రికేయుల ను విస్మరించుట తగునా?

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించి ఎంతో పోరాటం సాధించిన జర్నలిస్టులను గుర్తించకపోవడం చాలా బాధాకరం.తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ప్రతి విషయాన్ని పెన్నుతో, ఎలక్ట్రానిక్ మీడియా సాధనాలతో ప్రజల ముందుకు పెట్టి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజల్లోకి పోవుటకు సహకరించిన విలేకరులను గుర్తించకపోవడం విచారకరం.. జర్నలిస్టులు తమదైన శైలి లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర సాధనలో పోరాటాలు చేసి అమరులైన జర్నలిస్టులు కూడా ఉన్నారు, రాష్ట్ర సాధనలో తూటా దెబ్బలు లాటి దెబ్బలు చవిచూసి ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్ర సాధనలో ముందున్న కలం, ఎలక్ట్రానిక్ మీడియా కార్మికులపై అలసత్వం ఎందుకు? మా పై ఎందుకు ఈ చిన్నచూపు.. కానీ నేడు జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో వారి స్థానం ఎక్కడ? ప్రజాప్రతినిధులారా, రాజకీయ నాయకుల్లారా , అధికారులారా. జర్నలిస్టులపై ఏది మీ విజ్ఞత? ఏది మీ సమన్వయం  రాజ్యాంగంలో నాలుగో స్తంభమైన జర్నలిస్ట్ లనే మర్చిపోతున్నారు… ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించాము కానీ తెలంగాణ రాష్ట్రంలో నేడు జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో జర్నలిస్టుల స్థానం మాత్రం మారలేదు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు , అధికారులు జర్నలిస్టులకు కనీస మర్యాద లేకపోవడం పట్ల విస్తుపోయి చూడడం తప్ప చేసేదేమీ లేనట్లే..కనీసం ఉద్యమ కాలంలో పనిచేసిన జర్నలిస్టులను కూడా గుర్తించే ఆలోచనలో లేని నేటి ప్రభుత్వం.
ఏమవుతుంది ఈ సమాజం ఎటుపోతుంది ఈ పాలన.. రాజకీయ నాయకుల్లారా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు కూడా ఓటర్లే గుర్తించండి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :