తిరుపతి : ఓ దినపత్రిక లో ప్రచురించిన న్యూస్ పైన, ఆ పత్రిక ప్రతినిధికి పాకాల కు చెందిన వార్డు మెంబర్ రావిళ్ళ మోహన్ నాయుడు ఫోన్ చేసి ఎవడ్రా న్యూస్ రాసింది, నువ్వు జర్నలిస్ట్ అయితే నాకేంటి, నిన్ను నీ బ్యూరో అంత తేలుస్తాం, రికార్డ్ చేసుకో, కేసు పెట్టుకో భయపడేది లేదు అంటూ బెదిరించి, వార్నింగ్ ఇచ్చి, నోటికి వచ్చినట్లు తిట్టడం జరిగింది. జరిగిన సంఘటనపై గురువారం తిరుపతిలోనే వివిధ జర్నలిస్టుల సంఘాలు ఆధ్వర్యంలో తిరుపతి ఎస్పీకి అతని మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు కోలా లక్ష్మీపతి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు మబ్బు నారాయణరెడ్డి, తిరుపతి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ విజయ్ యాదవ్, గిరిధర్, ఉమాపతి, ప్రవీణ్, ఫోటోగ్రాఫర్ ప్రవీణ్, పరమేష్ రాజు, రాజేష్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.