సిద్దిపేట జిల్లా : అక్కన్నపేట మండలంలోని గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమాజితాండలో ఇటీవల మరణించిన ధరావత్ తరుణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, తరుణ్ మరణానికి గల కారణాలను తెలుసుకొని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎస్టీ మోర్చా నాయకులు లవుడ్య మహేష్,గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుగులోత్ భాస్కర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.