- ఏడాదిన్నరలోగా ప్రతి ఇంటికి నీటి కొళాయి
- అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనం
- మాచర్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తాం
- టిడిపి శ్రేణులు సంయమనం తో వ్యవహరించారు
- గత ప్రభుత్వ అక్రమాలపై ఫైల్లు కనిపించకపోతే కఠిన చర్యలు
- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
మాచర్ల నియోజకవర్గం లో చాలా ప్రాంతాల్లో ఇంట్లో అవసరాలకు త్రాగేందుకు నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆ పరిస్థితిని ప్రజలను కట్టికించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు బుధవారం మాచర్ల పట్టణంలోని అన్న క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఏడాదిన్నరలోగా మాచర్ల నియోజకవర్గం లోని గ్రామాలకు మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేస్తామన్నారు. వరికిపూడిశెల, జెర్రీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి త్వరితిగతన సాగు తాగునీరు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మాచర్లను ఆధునికరిస్తామన్నారు. పేదలకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్లను గత పాలకులు అటకెక్కించారని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించి పేదలకు ఉచిత నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వ విధానం వచ్చేవరకు మాచర్ల పట్టణానికి చెందిన ఆర్య వైశ్యులు అన్న క్యాంటీన్ నడపడానికి ముందుకు రావడం హర్షనీయమన్నారు. గత పాలకులు ఇప్పటికీ తమ బుద్ధులు మార్చుకోలేదని టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేస్తూ దాడులు చేస్తున్నారని టిడిపి కార్యకర్తలు నాయకులపై ఈగ వాలిన సహించేది లేదని అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థలో కొంతమంది ఇంకా తమ ప్రవర్తన మార్చుకోలేదని టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కార్యకర్తలు నాయకులు సమయంలో పాటించాలని దీర్ఘకాలికంగా టిడిపి ప్రభుత్వం కొనసాగాలంటే గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తానని బ్రహ్మారెడ్డి హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన గత ప్రభుత్వం తాలూకా ఫైళ్లను కనిపించకుండా చేసిన కనిపించలేదు అంటూ సమాధానాలు తెలిపిన సర్వీసు నుండి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని బస్సు యాత్రలో చేయటం ద్వారా సామాజిక న్యాయం జరగదని అభివృద్ధి ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు వజ్రం నాయక్ కౌన్సిలర్ మదర్ సాహెబ్ ఎల్లమంద అనిల్ సురేష్ పుల్లారావు అనంతరాములు మొహిద్దిన్ భాష పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.