అమరావతి,మాచర్ల : దశాబ్దాల కాలంగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. మంగళవారం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు వరికపూడి సెల ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగు త్రాగు నీటి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని ఆయన చెప్పారు. మాచర్ల పురపాలక సంఘ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించేందుకు బుగ్గ వాగు స్కీం ద్వారా పైపులైనుండి పురపాలక సంఘ ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలోని ఇంటింటికి తాగునీరు కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అలాగే మాచర్ల నియోజకవర్గ ప్రజలకు మంచి వైద్యం అందించటం కోసం మల్టీస్పెషల్టి ఆసుపత్రిని నిర్మాణం చేయటం తో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.