పల్నాడు జిల్లా : మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మిర్యాలగూడ మాజీ మిలిటెంట్లతో బేరాలు చేస్తున్నారని, వైసీపీ నేతలు తనను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపే దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా వచ్చి తనపై చేయి వేయాలన్నారు. మాచర్ల పార్క్ సెంటర్‌లో సింగిల్‌గా ఉంటానని, దమ్మున్నవారు వచ్చి తనను టచ్ చేయాలని సవాల్ చేశారు.
వైసీపీ మళ్లీ అరాచకాలతో అధికారంలోకి వచ్చే కుట్రలు చేస్తోందన్నారు. దొంగ ఓట్ల ద్వారా మాచర్లలో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. వైసీపీ దుర్మార్గాలపై తాము పోరాటం చేస్తామని, రానున్న ఎన్నికల్లో అరాచక శక్తులను తరిమి కొడతామన్నారు. దొంగ ఓట్లపై పోరాటం చేస్తామని చెప్పారు. కుట్రలు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరన్నారు.