సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో గూడెం గ్రామస్తులు గత 13 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నందున వారికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో 3 ఎకరాల భూపంపిణీ చేపట్టారని, వాటిలో అనర్హులు ఉన్నారని మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ తెలిపారని, కానీ నేడు అనర్హులకు అర్హులుగా చూపెడుతూ వారికి భూమి కేటాయించారని, వారిని వెంటనే గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు. పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయకుండా అనర్హులకు భూమి కేటాయించారని, అర్హులకు న్యాయం చేసే వరకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల ఫోరం మండల అద్యక్షులు దుంబాల రాజమహేందర్ రెడ్డి, ప్యాక్స్ వైస్ ఛైర్మన్ బండి రమేష్, మాజీ వ్యయసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మండ్ల లక్ష్మారెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అద్యక్షులు దీటి బాలనర్సు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అద్యక్షులు వడ్లూరి పర్శరాములు, మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, యువజన విభాగం మండల అద్యక్షులు బిగుల్ల మోహన్,పొన్నాల వీరేశం తదితరులు పాల్గొన్నారు.