- ముంబైలో గౌరవ డాక్టరేట్ అందుకున్న నందీఅవార్డు గ్రహీత
తిరుపతి: నంది అవార్డు గ్రహీత, ప్రముఖ జ్యోతిష్య పండితులు,సరస్వతి పుత్రుడు చక్రధర్ సిద్ధాంతి ముంబైలో జ్యోతిష్య చక్రవర్తి అవార్డు, అలాగే గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.ఆదివారం ముంబై నగరంలోని కంట్రీ క్లబ్లో ఈ అరుదైన అవార్డులను అందుకున్నారు. ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్( ఐఎన్సి),అమెరికన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ జ్యోతిష్య సంస్థాన్ వారు జ్యోతిష్య చక్రవర్తి అవార్డు, అలాగే గౌరవ అమెరికన్ బోనరరీ డాక్టరేట్లను ప్రధానం చేసి గౌరవించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత చక్రధర్ సిద్దాంతి మాట్లాడుతూ శ్రీవారు,రాధా గోవిందుని సంకల్పంతోనే తనకు అవార్డులు లభించినట్లు చెప్పారు.జ్యోతిష్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులతో తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో తన వంతు పాత్రపోషించినట్లు సిద్దాంతి చక్రధర్ వివరించారు. ఈ కార్యక్రమంలో థాయ్లాండ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఇతికాన్, అమెరికా ,ఢిల్లీ జ్యోతిష్య పండితులు పాల్గొన్నారు.