- తిరుపతిలో రాష్ట్ర స్థాయి జ్యోతిష్య సమ్మేళనం.
- ప్రముఖ జ్యోతిష్య పండితులు, సిద్దాంతి యల్ విజయ సుబ్రహ్మణ్యం
ఉన్నత లక్ష్యంతో పాటు, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 29, 30 తేదీలలో తిరుపతి వేదికగా “రాష్ట్ర స్థాయి జ్యోతిష్య సమ్మేళనాన్ని” నిర్వహించనున్నట్లు
ప్రముఖ జ్యోతిష్య పండితులు, సిద్దాంతి యల్ విజయ సుబ్రహ్మణ్యం స్వామి తెలియజేసారు.
గురువారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ..,నందిఅవార్డు గ్రహీత ,ప్రముఖ జ్యోతిష్యులు చక్రధర్ సిద్దాంతితో కలసి.., జ్యోతిష్య సమ్మేళనానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.మానవుని హితం కోరేదే జ్యోతిష్యమన్నారు. అటు వంటి జ్యోతిష్య విలువలు ప్రపంచానికి తెలియజేయాలనే ఆశయంతో గురుదేవులు శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠ జగద్గురువుల ఆశీస్సులతో ఈ సమ్మేళనానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
దేశం నలుమూలల నుంచే కాకుండా మలేశియా, సింగపూర్, శ్రీలంక మొదలగు విదేశాల నుంచి కూడా ప్రముఖ జ్యోతిష సిద్ధాన్త పండితులు ఇందులో పాల్గొననుచున్నారనీ చెప్పారు. ఈ సమ్మేళనంలో
వ్యవసాయం, జ్యోతిషం,
జ్యోతిష రీత్యా ప్రకృతి పరిశీలన,
నిత్య జీవితంలో జ్యోతిష శాస్త్ర ఉపయోగం,
నామనక్షత్ర వివేకం ,
పంచాంగ గణన – ఖగోళ పరిశీలన,
ఖగోళ యంత్రముల ద్వారా గ్రహ సాధన,
మేఘ మాలికా శాస్త్రం
లాంటి అరుదైన అంశాల పై పండితులు తమ వ్యాసాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్,అలాగే ప్రసంగాల ద్వారా తెలియజేస్తారని వివరించారు.
జ్యోతిషం అంటే కేవలం జాతకం కాదునీ ప్రకృతితో ముడిపడిన అంశం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలనీ సుబ్రమణ్యం సిద్దాంతి సూచించారు. భవిష్యత్తును తెలియజేసే జ్యోతిష్య గొప్పదన్నాన్ని అందరూ తెలుసుకోవలసిన అవసంరం ఎంత్తైనా ఉందన్నారు.
శ్రీకంచి కామకోటి పీఠ జగద్గురువుల ఆదేశాలతో.., వారి సమక్షంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో
కంచిపీఠ ఆస్థాన సిద్ధాన్తి
యల్.విజయ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి,
శ్రీరమణ శర్మ, రేమెళ్ల అవధానులు, సాగి కమలాకరశర్మ, అభిషేక్ జోషి, అనీష్ వ్యాస్, వివేకానందన్ (మలేశియా), బాలూ శరవణన్, ఉపద్రష్ట సుర్యనారాయణమూర్తి, పుచ్ఛా శ్రీనివాసరావ్, పాలపర్తి శ్రీకాంత్ లాంటి ప్రముఖులు పాల్గొంటారనీ ఆయన తెలియజేసారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన జ్యోతిష్య పండితులను ఈ సందర్భంగా గౌరవించనున్నట్లు చెప్పారు.