పవన్ కళ్యాణ్ పై ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఏపీలో పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్‌ను అందరు మోసం చేస్తున్నారన్నారు కేఏ పాల్. అందుకే తన దగ్గరకు వచ్చేయాలని పవన్‌కు పిలుపు నిచ్చారు కేఏ పాల్.
పవన్ కళ్యాన్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. గత కొన్నిరోజులుగా పవన్ కూడా రాజకీయాలోపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పొలిటికల్ స్ట్రాటజీని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు పవన్. ఏపీ సర్కారుపై వీలు దొరికినప్పుడల్లా విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్ని పవన్ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే సీరియస్‌గా పాలిటిక్స్ పై పనిచేస్తున్నారని సమాచారం.
అయితే తాజాగా పవన్ కళ్యాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చేయ్.. నీకునా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అంటూ.. కీలక వ్యాఖ్యలు చేశారు పాల్. పవన్‌ను తనతో వచ్చి కలిసి పనిచేయమని పిలుపు నిచ్చారు.
ఏపి క్రైమ్ న్యూస్
పవన్ గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని.. అందరూ ఆయనను.. మోసం చేశారన్నారు. పవన్ ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే, మంత్రి కావాలంటే.. మంత్రి… సీఎం కావాలంటే సీఎం చేస్తానన్నారు కేఏ పాల్. ఇప్పటివరకు అన్ని పార్టీలు తమ్ముడ్ని మోసం చేశాయన్నారు. ఆంధ్రాలోనే లేనే లేదన్నారు.ఇక ఆ పార్టీ పవన్ కళ్యాణ్‌ను సీఎం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఒక శాతం కూడా లేదన్నారు. తెలంగాణలో 5 శాతం మాత్రమే ఉందన్నారు
సందర్భంగా జగన్ పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా తన తమ్ముడే అన్నారు కేఏ పాల్. జగన్ మళ్లీ సీఎం అవుతారంటా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం.. ఇస్తూ.. జగన్‌ను దేవుడు దీవించాలని తన కోరిక అన్నారు. జగన్‌కు అప్పుల రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. ఇక నవరత్నాల కోసం జగన్ ఎక్కడ నుంచి డబ్బులు తెస్తాడన్నారు కేఏ పాల్.
సీఎం జగన్‌తో కూడా భేటీ అవుతానన్నారు కేఏ పాల్. జగన్ వచ్చి కలిసినా తనకు ఏం అభ్యంతరం లేదన్నారు. లేదా తనను కలిసేందుకు పిలిచినా వెళ్తానన్నారు. ఆయన ఇంటికి పిలిచాన కలిసేందుకు వెళ్తానన్నారు. తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు, అలానే చంద్రబాబు వచ్చినా కలుస్తానన్నారు. తనకు రాష్ట్రం, ప్రజలు, రాష్ట్ర అభివృద్ధియే ముఖ్యమన్నారు పాల్.
కేఏ పాల్… మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏపీలో ఆయన ప్రస్తుతం పర్యటనలు చేపట్టారు. నుంచి పాల్ తన ఏపీ పర్యటన ప్రారంభించారు. అక్కడి నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అయితే తొలిరోజే ఆయనకు కాకినాడలో భారీ షాకులు తగిలాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు.