మంచిర్యాల జిల్లా,చెన్నూర్ పట్టణంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ కేంద్రమంత్రి (కాక) వెంకటస్వామి 9వ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గజ్జల అంక గౌడ్, గోడిసెల బాపు రెడ్డి చిన్న సూర్యనారాయణ, చెన్నూరి శ్రీధర్ ,పాతర్ల నాగరాజు, ఈర్ల నారాయణ, ఎండి అజ్జు తదితరులు పాల్గొన్నారు.