కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుని మండలం వెలమకొత్తూరులో నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. పందులను చంపేందుకు నాటు తుపాకీతో కాల్పులు జరిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.
ఈ రోజు ఉదయం వెలమకొత్తూరులో పెంపుడు పందులను చంపేందుకు గ్రామస్తులు నాటు తుపాకీని ఉపయోగించారు.
ఇదే సమయంలో ఇంటి బయట తోటి పిల్లలతో నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఆడుకుంటోంది. అయితే ప్రమాదవశాత్తు తూటా ధన్యశ్రీకి తగిలింది. దీంతో ఆడుకుంటున్న చోటే చిన్నారి కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది.
నిబంధనలకు విరుద్ధంగా నాటు తుపాకులను ఉపయోగించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…!!