- పారిశ్రామిక వేత్త కృషిని ప్రశంసించిన విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ.
తిరుపతి : పారిశ్రామిక రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త సూదలకుంట కృష్ణ కల్యాణ్ కుమార్ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఈ డాక్టరేట్ను ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన అంతర్జాతీయ వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో హైదరాబాద్కు చెందిన విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ వారు.., తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు చేతుల మీదుగా కృష్ణ కల్యాణ్ కుమార్కు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేయించి,గౌరవించారు.ఆయన సేవలు, కృషిని ప్రసంశించారు.గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల కృష్ణ కల్యాణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి తాను అందించిన సేవలను విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ వారు గుర్తించడం అభినందనీయమన్నారు. తనకు లభించిన గౌరవ డాక్టరేట్ స్పూర్తితో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు విశేషమైన సేవలందించడంతో పాటు.., సమాజానికి ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ అధినేత విశ్వనాథ్ ,కంచికామకోటి ఆస్థాన పండితులు లక్కావజ్జుల విజయ సుబ్రహ్మణ్యం సిద్దాంతి, పండితులు పాల్గొన్నారు.