కమారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై రైతులు తమకు అభ్యంతరాలు చెప్పొచ్చని అన్నారు కలెక్టర్ జితేష్ పాటిల్. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 11 వరకు అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. ఇక.. ఇండస్ట్రియల్ జోన్ అంటే భూసేకరణ కాదని, ఎవరి భూములను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌తో ఎవరూ భూములను కోల్పోరని చెప్పిన కలెక్టర్.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
