కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని మండల ప్రజలు అందరూ సద్వినియొగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపల్లి నర్సింహారెడ్డి, డాక్టర్ సందీప్ రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు దుడ్డు మల్లేశం, వైద్య సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.