- ముఖ్య అతిథులు విసి సజ్జనర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మేడ్చల్ /కాప్రా : విసీ సజ్జనర్ రవాణా సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి తో కలిసి ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి బొందాడ గ్రూప్ సంస్థల కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రూప్ సంస్థల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా రానున్న రోజుల్లో సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ యువతకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొందాడ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 2012 లో బొందాడ గ్రూప్ సంస్థ ప్రారంభమైంది అన్నారు, టెలికాం, సోలార్ ప్రాజెక్టుల నిర్మాణంలో తాము ప్రధానంగా నిమగ్నమయ్యామన్నారు. ప్రతిభ కలిగిన యువతీ యువకులకు ఉద్యోగం కల్పించడం ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో బొందడ గ్రూప్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ భరతం సత్యనారాయణ, డైరెక్టర్ బొందడ నీలిమ, డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, నాయకులు సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.