కారంపూడి లోని టిడిపి పార్టీ కార్యాలయం వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు మాచర్ల రోడ్డులోని టిడిపి పార్టీ ఆఫీస్ వద్ద భద్రత దళాలు నిత్యం పహారా కాస్తున్నాయి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కారంపూడి మండలంలోని సిఐ అలహరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్ ఐ k. అమీర్ తెలిపారు.. ఈనెల ఐదో తేదీ వరకు మండలంలో ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలని ప్రజలను కోరారు