- కారంపూడి మోడల్ స్కూల్ లో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాద్యాయుడు
- ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన మహిళలు
- పాఠశాలకు చేరుకొని విచారణ జరుపుతున్న మండల విద్యశాఖ అధికారి, కారంపూడి ఎస్సై అమీర్
పల్నాడు జిల్లా / కారంపూడి : కారంపూడి మోడల్ స్కూల్ లో విద్యార్థినిల పట్ల ఓ కిచక ఉపాద్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గురువారం విద్యార్థినిల తల్లితండ్రులు కిచక ఉపాద్యాయుడిని తల్లితండ్రులు పాఠశాలలోనే దేహశుద్ధి చేసారు. ఇంత జరుగుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల వద్ద విద్యార్థినిల తల్లితండ్రులు ఆందోళన చేశారు. ప్రిన్సిపాల్ విధులకు సక్రమంగా హాజరుకావడంలేదని దీనితో పాఠశాలలో చదివే విద్యార్థినిలకు సరైన రక్షణ కరువైందని విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కిచక ఉపాధ్యాయుని పై అలాగే మరికొంతమంది సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యశాఖ అధికారి పాఠశాలకు చేరుకొని విద్యార్థిని తల్లితండ్రుల నుండి లిఖిత పూర్వక ఫిర్యాదును స్వీకరించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఉన్నత అధికారులకు తెలియజేస్తమని ఎం.ఈ.ఓ తెలిపారు. సంఘటన స్థలానికి కారంపూడి ఎస్సై అమీర్ చేరుకొని ఆరోపణలు ఎదురుకుంటున్న కిచక ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులు సిబ్బందిని ప్రభుత్వం వెంటనే బదిలీ చేసి, విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుల పై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా జిల్లా అధికారులను తల్లితండ్రులు కోరారు.