పల్నాడు జిల్లా కారంపూడి పట్టణము నందు గాంధీ బొమ్మ సెంటర్లో గల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి శనివారం మధ్యాహ్న 12 గంటలకు శ్రీవాసవీ సేవ అన్న ప్రసాద్ కమిటీ నిర్వహణలో ఈ శనివారం దాతలుగా చింతా చిన్న శంభు లింగం( లేటు) చింత రామలింగం (లేటు), చింతా కాశీ విశ్వనాథం(USA) వారి కుటుంబ సభ్యుల సహకారంతో 500 మందికి పులిహోర , పెరుగన్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లావాసవి క్లబ్ వైస్ గవర్నర్ భవిరిశెట్టి రామారావు ఆర్యవైశ్య నాయకులు కొత్త నరసింహారావు, వల్లంబట్ల నరేష్. వాసవి సేవాదళ్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిన్ని లక్ష్మి ట్రెజరర్ మాడిశెట్టి పుష్పలత, కొమ్మూరి సాయిరేష్మ,పొట్టి మూర్తినాగలక్ష్మి, నల్లమల్లి అనురాధ, సోము శైలజ యక్కల ప్రమీల, నాళo ఆదిలక్ష్మి, సూరే గీత తదితరులు అన్న వితరణ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు