కారంపూడి పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సత్యం మరియు అహింసను ఆయుధాలుగా తీసుకొని భారత దేశ స్వేచ్ఛా సమరాన్ని ముందుండి నడిపించిన గాంధీజీ సేవలను ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమానికి కారంపూడి సర్పంచ్ బాణావత్ సరస్వతి, ఈవో పీఆర్డి సత్యప్రసాద్, పంచాయతీ సెక్రటరీ కసిన్యా నాయక్, పట్టణ అధ్యక్షులు కటికల బాలకృష్ణ, పలిశెట్టి రాఘవ, జానీ భాష, బొమ్మిన శేషగిరి, జక్కా నరసింహారావు, పలిశెట్టి కొండ, పెనుగొండ బ్రహ్మ, శంకర్, పూర్ణ చంద్రరావు వంటి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బాణావత్ సరస్వతి గాంధీ ఆశయాలను అందరికీ గుర్తు చేస్తూ, “మహాత్మా గాంధీ చూపించిన మార్గం, అనేక విషయాల్లో నేటి సమాజానికి కూడా ప్రేరణగా ఉండాలి” అని అన్నారు.