- అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వేస్తున్న భారీ సెట్టింగ్లు*గత రెండు
- రోజులుగా తరగతుల నిర్వహణకు అడ్డంకులు
- టెన్త్ సిలబస్ పూర్తికాక వెనక పడుతున్న విద్యార్థులు
పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో ఉన్న బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను కళ్యాణ వేదికగా మార్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులు చదివే పాఠశాలలను నాడు నేడు క్రింద కొన్ని కోట్లు ఖర్చుపెట్టి పాఠశాల ప్లే గ్రౌండ్ ఆట స్థలాన్ని తరగతులను ఆధునికరించారు. పేద విద్యార్థుల చదువు ఏమైపోతే మాకెందుకులే అని పట్నంలోని కొందరు రాజకీయ నాయకులు మద్దతుతో పాఠశాల ఆవరణంలో భారీ పెళ్లి సెట్టింగులు వేస్తున్నారు.
దీనివలన గత రెండు రోజులుగా విద్యార్థుల చదువులకు తరగతులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాఠశాల ఆవరణంలో వివాహ వేడుకలు జరుపుకొనుటకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా పాఠశాలలో దూరి వివాహ వేడుకలు చేసుకుంటున్నారు.
సుమారు నెలరోజుల వ్యవధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతుండగా పరీక్షలు రాసేందుకు పదో తరగతి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఉదయం సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
ఈ విధంగా పరీక్షల సమయంలో విద్యార్థుల తరగతులకు ఆటంకం కలిగిస్తూ వారి భవిష్యత్తుకు గండి కొట్టే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాల ఆవరణమును ఉపయోగించుకుంటూ ఆవరణంలో భారీ సెట్టింగ్లో నిర్వహిస్తూ విద్యార్థుల తరగతులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
హెచ్ఎం, అనంత శివ వివరణ కోరగా నా అనుమతి లేకుండా స్కూలు ఆవరణంలో భారీ సెట్టింగ్లు వేస్తున్నారని విద్యార్థుల తరగతులకు ఆటంకం కలుగుతుందని చెప్పినా వినకుండా వారి ఇష్టానుసారంగా గత రెండు రోజులుగా పాఠశాల ఆవరణాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇదేమిటే అనే ప్రశ్నిస్తే మేము పర్మిషన్ తెచ్చుకుంటాము అని చెబుతున్నారు అని అన్నారు ఇంతవరకు పర్మిషన్ పత్రాలు నాకు అందజేయలేదని ఆయన అన్నారు.
ఇటువంటి వివాహ వేడుకలు పాఠశాల తరగతులు నిర్వహించే సమయాల్లో జరుపుకునేందుకు గ్రామస్తులు పునరాలోసించుకోవాలని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వివాహ వేడుకలు మరొకచోట నిర్వహించుకోవాలని హెచ్ఎం అనంత శివ తెలిపారు.