పల్నాడు జిల్లా , కారంపూడి: పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలైన సందర్భంగా మండలంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో పరీక్షా కేంద్రాన్ని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఉండరాదని, విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు, ప్రత్యేకంగా తాగునీరు, మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు. ఎగ్జామ్స్ సెంటర్ కు ఇతరులు ఎవరు రాకూడదని అన్నారు. ఆయా పరీక్షల కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పాటు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో గంట శ్రీనివాసరెడ్డి,తహసిల్దార్ జయవర్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ తదితరులు ఉన్నారు.