ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరైన విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తాహాసిల్దార్ శ్రీనివాస యాదవ్ తెలిపారు. పరీక్ష రాసేందుకు 237 మంది గాను 228 మంది హాజరైనట్లు మరో 9 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు శాంతి భద్రతలో దృష్ట్యా పోలీస్ శాఖ తన సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు పరీక్ష కేంద్రాలను తాహాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎస్ఐ రామాంజనేయులు పరిశీలించారు..