- సర్పంచ్ ఒంటెద్దు పోకడ నిర్ణయాలకు నిరసన…
- 2023- 024 సంవత్సరానికి టెండర్లను వ్యతిరేకించిన సభ్యులు…
- స్వీపర్ల జీతాల పెంపునకు సభ్యుల ఏకగ్రీవ ఆమోదం…
పల్నాడు జిల్లా, కారంపూడి: కారంపూడి పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ రామవతు ప్రమీల తేజానాయక్ అధ్యక్షతన శుక్రవారం సాధారణ సమావేశం జరిగింది. గ్రామా పంచాయతి పరిధిలో ఉన్న వార్డులలో సభ్యులకు చెప్పకుండా గత తీర్మానాలలో సభ్యులు ఆమోదించిన పనులు కాకుండా సర్పంచ్ తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన పనులను ఒంటెద్దు పోకడల చేసుకుంటున్నాడని, పంచాయతీ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్మానం చేయని పనులను పూర్తీ చేసిన తరువాత సభ్యుల ఆమోదం కోసం పంచాయతి సాధారణ సమావేశంలో సర్పంచ్ ప్రవేశ పెట్టడంతో ఇదేమి పద్దతి అని సర్పంచ్ ను సభ్యులు నిలదీశారు. సభ్యుల కు చెప్పకుండా పూర్తీ చేసిన పనులను వ్యతిరేకిస్తున్నామని సభ్యులు ఏకగ్రీవంగా సభలో తెలియచేసారు. గత మూడు ,నాలుగు సాధారణ సమావేశాలలో సభ్యులు ఆమోదించి తీర్మానించిన పనులను నేటికీ మొదలు పెట్టలేదని వారు నిరసన వ్యక్తం చేసారు . మేము వార్డులలో ఏ ఒక పని చేయించలేదని ప్రజలు మమ్మలను నిలదీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు . పంచాయతీలో ప్రతి ఏడాది వివిధ సామాగ్రిని సప్లై చేసేందుకు టెండర్లను పిలుస్తున్నారని టెండరును దక్కించుకున్నది ఎవరో కూడా సభ్యులకు తెలియచేయడం లేదన్నారు . కాబట్టి 2023 – 024 సంవత్సరానికి టెండర్ వ్యతిరేకిస్తున్నామన్నారు , ప్రతి సంవత్సరం ఒక్కరే టెండర్ దక్కించుకొంటున్నారని, ప్రస్తుతం టెండర్లను నిలిపివేయాలన్నారు . పంచాయతీలో పని చేస్తున్న స్వీపర్లకు జీతాలను పెంచాలని సభ్యులంతా ఏకగ్రీవంతో ఆమోదించారు. పట్టణంలోని చెక్ పోస్ట్ సెంటర్ లో మహిళా ప్రయాణికులకు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని , కావున టాయిలెట్స్ నిర్మించాలని , మోడల్ ,కస్తూర్భా పాఠశాల వద్ద విద్యార్థుల కోసం బస్సు షెల్టర్ నిర్మించాలని జడ్పీటీసీ షేక్ షఫీ సభ దృష్టికి తీసుకువచ్చారు . పంచాయతీలోని వార్డులలో ఉన్న సమస్యలపై సభలో అర్జీలను సభ్యులు అందించగా వాటిని ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. ఈ సమావేశంలో సర్పంచ్ రామవతు ప్రమీలా తేజ నాయక్, ఉప సర్పంచ్ సురె అంకారావు, ఈవో కసిన్యా నాయక్, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు అక్బర్ జానీబాషా, ఎంపీటీసీ లు వేముల పద్మ లింగయ్య, బొమ్మిన సావిత్రి అల్లయ్య, అంతరగడ్డ ఏసోబు, వార్డు సభ్యులు పఠాన్ జానీబాషా, బాటరీ జానీ తదితరులు పాల్గొన్నారు.