contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karampudi : అధ్వానంగా రహదారులు .. పట్టించుకోని అధికారులు, నాయకులు

  • పేటసన్నేగండ్ల – నరమాలపాడు ఆర్. అండ్. బి రోడ్డుకు మోక్షం ఎప్పుడు సార్…
  • అద్వాన్న స్థితిలో మాచర్ల ప్రధాన రహదారి
  • మరమ్మత్తుల పేరుతో కాలక్షేపం చేస్తున్న ఆర్. అండ్. బి అధికారులు
  • నూతన రోడ్డుకు నిధులు మంజూరు కాలేదంటున్న ఆర్. అండ్. బి అధికారులు
  • ఏళ్లతరబడి దుమ్ముదూలితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

 

మండలంలోని పలు ప్రధాన రహదారులు అధ్వాన స్థితికి చేరాయి. ఆ రహదారుల వెంబడి ప్రయాణించలేక వాహన చోదకులు, పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారులపై అడుగడుగునా గుంటలు పడ్డాయి. కనీసం సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేసిన దాఖలాలు కూడా లేవు. ఏళ్ల తరబడి నుంచి కనీసం మర్మతులు కూడా లేకపోవడంతో మరింత అధ్వానంగా తయారయ్యాయి.

పల్నాడు జిల్లా, కారంపూడి : మండలంలోని ప్రధాన రహదారుల్లో పేటసన్నేగండ్ల వద్ద నుండి నరమాలపాడు వరకు మాచర్ల ఆర్. అండ్. బి రోడ్డు ఏళ్ల తరబడి అద్వాన్న స్థితిలో ఉంది. రహదారులు గోతులు పడ్డాయి. దీంతో రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళ గోతుల్లో పడి వాహన చోదకులు నిత్యం ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ ప్రాంతంలో దుమ్ముదూలితో వాహనదారులు, పాదచరులు ఇబ్బంది పడుతున్న ఆర్ అండ్ బి అధికారులు మాత్రం నూతన రోడ్డు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని చెప్పవచ్చు. అద్వాన్న స్థితిలో ఉన్న రోడ్డును ఇటీవల ఆర్. అండ్. బి అధికారులు తుతూ మంత్రంగా మట్టితొలి మారమ్మత్తులు చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలు హమ్మయ్య నూతన రోడ్డు మంజూరు అయిందేమో అని సంతోషపడ్డారు. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో రోడ్డు అద్వాన్న స్థితిలో ఉండటంతో ఈ ప్రాంతంలో వాహనదారులు ప్రమాదలకు గురై గాయాలు పడిన సంఘటనలు అనేకం దర్శనం ఇచ్చాయి. అసలు ఈ ప్రాంతంలో నూతన రోడ్డుకు ఆర్. అండ్. బి అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఇటీవల ఈ ప్రాంతంలో రోడ్డు అద్వాన్న స్థితిలో ఉండటంతో దుమ్ముదూళి అధికం కావటంతో ఆర్ అండ్ బి అధికారులు ట్యాంకర్ ద్వారా నీళ్ళు చాల్లే కార్యక్రమన్ని చేపడుతున్నారు. అయినప్పటికీ నీళ్లు చాల్లే సమయంలో తప్ప మిగితా సమయాలలో దుమ్ముదూలి వస్తుండటంతో నూతన రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి మరోపక్క నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని నిధులు మంజూరు అయ్యాక నూతన రోడ్డును ఏర్పాటు చేస్తామని స్వయంగా ఆర్ అండ్ బి అధికారులే చెప్తున్నా పరిస్థితి. ప్రజల ఇబ్బందులను గమనించి మాచర్ల ప్రధాన రహదారిలో భాగంగా పేటసన్నేగండ్ల నుండి నారమాలపాడు వరకు నూతన రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :