గుంటూరు జిల్లా కారంపూడి : హలో బాసు మీరు ఆరోగ్యంగా ఉన్నారా అయితే ఒక్కసారి కారంపూడి రండి ఎక్కడ లేని జబ్బులు మీ చెంతకు చేరాతాయి ఇది నిజమండి బాబు ఏమిటంటే మండల కేంద్రమైన కారంపూడిలో ఆర్ అండ్ బి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం వలన దుమ్ముదూలితో ఇక్కడ ప్రజలు అల్లాడుతున్నారు. చెక్ పోస్టు వద్ద నుండి ఎన్ఎస్ పి కాలనీ వరకు ద్విచక్ర వాహనాల పై లేదా నడిచి వెళ్ళాలి అంటే నరకం కనబడుతుంది. ఒక్కసారిగా వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతమైన దుమ్ముదూలి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే సీతకాలంలో ఉదయాన్నే మంచు కమ్మే విధంగా ఇక్కడ నిత్యం వాహనాలు వెళ్తూ ఉంటే మంచును తలపించేలా దుమ్ముదూలి విపరీతంగా వస్తుంది. దీనితో కారంపూడి ప్రజలు అనారోగ్యనికి గురై గొంతు ముక్కు చెవి సమస్యలతో అల్లాడుతున్నారన్న మాట అక్షరసత్యంగా చెప్పవచ్చు. ఇక ఈ ప్రాంతంలో నడిచే పాదచారులకు ఇంట్లో పౌడర్ పూసుకోవలసిన అవసరం లేదు రోడ్డు పైకి వస్తే చాలు ఒళ్ళంతా దుమ్ము ఇది పరిస్థితి. అంతేకాకుండా ఈ దుమ్ముదూలి వలన విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చెక్ పోస్టు వద్ద జిల్లా పరిషత్ హైస్కూల్ అలాగే మాచర్ల రోడ్డులో రెయిన్ బో, సెయింట్ జాన్స్ పాఠశాలలు ఈ ప్రాంతంలో ఉండటంతో చిన్న పిల్లలు విద్యార్థినివిద్యార్థులు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్దులు ఈ ప్రాంతంలో ప్రయాణించాలంటే భయపడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక్కసారి టూవీలర్ పై చక్కర్లు కొడితే సాయంత్రానికి అనారోగ్యనికి గురై ఆసుపత్రి పలు కావటం ఖాయం. ఇదంతా ఈ ప్రాంతంలో రోడ్డు అద్వాన్నంగా ఉండటం వలన దుమ్ముదూలి సమస్య తలెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికైన పంచాయతీ మరియు రోడ్లు భవనాల శాఖ అధికారులు తక్షణం స్పందించి దుమ్ముదూలి నివారణ చర్యలు యుద్ధప్రతిపదికన చేపట్టి ఈ ప్రాంతంలో నూతన రోడ్డు ఏర్పాటు అయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.