- కారంపూడిలో సినీ పక్కిలో చైన్ స్నాచ్చర్ హల్ చల్
- డమ్మీ పిష్టల్ చూపి మహిళ మేడలో గొలుసు లాగే ప్రయత్నం
- మహిళ కేకలు వేయటంతో చైన్ స్నాచ్చర్ పరార్
- వెంటాడి పట్టుకున్న రాత్రి గస్తీ పోలీసులు
పల్నాడు జిల్లా కారంపూడి : కారంపూడిలోని సాయి కృష్ణ కాలేజీ ఏరియా కాలేజీ పక్కన ప్రధాన రహదారి వద్ద బొజ్జ లక్ష్మి అనే మహిళ బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తుంది. రాత్రి సమయంలో షాపు మూసేసి షాప్ కు ఎదురుగా ఉన్న గల్లీ నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె మేడలో ఉన్న గొలుసును గ్రహించిన చైన్ స్నాచర్ ఆమెను అడ్డగించి డమ్మీ తుపాకీతో బెదిరించి మేడలో ఉన్న గొలుసును లాగే ప్రయత్నం చేసాడు ఆమె కూడా గొలుసును గట్టిగ పట్టుకొని కేకలు వేయటంతో బొజ్జ లక్ష్మి కేకలు వినిన ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుపక్క నివాసల ప్రజలు ఒక్కసారిగా ఆమె కేకలు విని ఆమె వద్దకు వస్తుండగా గ్రహించిన దొంగ ఆమెను నెట్టి పారిపోయాడు. దీనితో ఆ ప్రాంత ప్రజలు దొంగను పట్టుకునేందుకు వెంటపడటం జరిగింది. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు జరిగిన సంఘటనను తెలుసుకొని, దొంగను పట్టుకునేందుకు రెండు, మూడు బృందాలుగా ఏర్పడి వెంటాడారు కానీ దొంగ తన దగ్గర ఉన్న తుపాకీ చూపించి బెదిరించాడు అయినా కానీ పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దొంగను విచారిస్తున్నట్టు సమాచారం . దొంగ దగ్గర ఉన్నది డమ్మీ పిస్టల్ అని సమాచారం. ఇంకా పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అప్రమత్తంగా వ్యవహరించటంతో ఆమె మేడలో ఉన్న గొలుసు ఆమెకు దక్కింది. దొంగను పట్టుకున్న పోలీసులను కారంపూడి మండల ప్రజలు అభినందించారు.