- ఫర్టిలైజర్స్& ఫిస్ట్ సైడ్స్ మరియు సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
పల్నాడుజిల్లా కారంపూడి పట్టణం బస్ స్టాండ్ సెంటర్ నాగులేరు బ్రిడ్జ్ పక్కనే ఉన్న ముచ్చర్ల వారిచే ఏర్పాటైన బస్సు షెల్టర్ ఆవరణలో ఫర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసారు. కారంపూడి రూరల్ సీఐ దార్ల జయకుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం తీవ్రతగా ఉన్నందున స్వచ్ఛంద సంస్థలన్నీ ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుమ్మేపల్లి నాగేశ్వరరావు, గురుజాల రెవిన్యూ డివిజన్ కన్వీనర్ చీతిరాల వెంకట కోటేశ్వరరావు, గజవేల్లి రామారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.