- పల్నాడు జిల్లా కేంద్రంలో స్వాతంత్ర వేడుకల సందర్బంగా జిల్లా కలెక్టర్, ఇంచార్జి మంత్రి, జిల్లా ఎస్పీల చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సి.ఐ
స్వాతంత్ర దినోత్సవన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లాలో మేరుగ్గా పనిచేసిన అధికారులకు స్వాతంత్ర వేడుకలలో ఉత్తమ పురస్కారాలు అందజేయటం అనవయితీ. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన కారంపూడి సిఐ దార్ల జయకుమార్ కు ఉత్తమ పురస్కార అవార్డుకు అధికారులు ఎంపిక చేసారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇంచార్జి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ చేతుల మీదుగా కారంపూడి సిఐ దార్ల జయకుమార్ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని పోలీస్ శాఖలో కారంపూడి సిఐ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శాంతిభద్రతలను పరిరక్షించే విధంగా సమర్థవంతమైన సేవలు అందించడంతో ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
తనకు పురస్కారం అందజేసిన జిల్లా ఇంచార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, కలెక్టర్ లోతేటి శివశంకర్, గురజాల డిఎస్పీ లకు ఈ సిఐ ధన్యవాదములు తెలిపారు.
ఉత్తమ పురస్కారం అందుకున్న కారంపూడి సి.ఐ దార్ల జయకుమార్ కు కారంపూడి ఎస్సై ఎం. రామాంజనేయులు, దుర్గి, రెంటచింతల ఎస్సై లు శుభాకాంక్షలు తెలిపారు.