- దేశంలో ఎన్నడు లేని విధంగా 300 మంది దాకా ప్రమాదంలో చనిపోయారు దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యతవహించాలితక్షణమే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కళ్ళకి 50 లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి
- తక్షణమే మృతుల కుటుంబాలకి క్షమాపణ చెప్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలి
- విలేకరుల సమావేశంలో మాచర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామచంద్రారెడ్డి వెల్లడి
ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన రైలు గూడ్స్ ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 300 మంది దాకా ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరమని కేవలం ఇది బిజెపి ప్రభుత్వం చేతగాని తనం వల్ల మాత్రమే జరిగిందని దీనికి కాంగ్రెస్ పార్టీ బాధితుల తరుపున నిలబడి పోరాటం చేస్తుందని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామచంద్రారెడ్డి తెలిపారు.కారంపూడి మండలంలో తమ
కార్యకర్తల కార్యక్రమానికి విచ్చేసిన ఆయన అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కేంద్ర ప్రభుత్వం చేతకానితనం వల్లనే వందల మరణాలు జరిగాయని కేంద్రరైల్వే శాఖ మంత్రి మృతులకు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్తూ తక్షణమే రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వం వారి చేత రాజీనామా చేయించాలని ఆయా పరిధిలోని వాళ్ళని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించి వారిపైకఠిన చర్యలు తీసుకోవాలని 300 మందిని హత్య చేసి ఏమి జరగనట్లుగా కేంద్రం ప్రవర్తిస్తుందని ఎవరి మీధనో ఈ తప్పు రుధ్హాలని చూస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అమాయక ప్రాణాలు తీసిన పాపం ఊరికే పోదని దీనికి కచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షలు నష్టపరిహారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జీవీ సత్యన్నారాయణ అసెంబ్లీ ఎస్సిసేల్ అధ్యక్షుడు కొమ్ముకోటేశ్వరరావు కారంపూడి మండల అధ్యక్షుడు ఏడుకొండలు. రెంటచింతల మండల ఎస్సిసేల్ అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాసరావు. సీనియర్ నాయకులు మాస్టర్ రాజారావు. సాగర్ బాబు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు