పల్నాడు జిల్లా కారంపూడి : స్వాతంత్ర దినోత్సవన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై రామాంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహనీయుల త్యాగఫలితమే మనకు స్వాతంత్రమని స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవలసిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు. మహనీయులు స్వాతంత్ర సమరయోధులు పింగళి. వెంకయ్య జాతీయ జెండాను రూపొందించి నేటికీ 77 వసంతాలు అయిందని, నేటి యువత మహనీయుల ఆశయ సాధన కు కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కారంపూడి స్టేషన్ ఏఎస్ఐలు శేఖర్ , కే.ఎస్.ఎన్ ప్రసాద్, కోటిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, దాసు, రైటర్ కిరణ్, పి. సి లు పోతురాజు, రమేష్, వెంకటరావు, ఈశ్వర్, జానీ కరీముల్లా, ఆంజనేయులు, శివకుమారి, కళ్యాణి, హోంగార్డ్ బ్రహ్మరెడ్డి, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.