contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కన్ను పడితే కబ్జా నే .. కారంపూడిలో రెచ్చిపోతున్న భూ మాఫియా !

  • కారంపూడిలో ఖాళీ స్థలం కనబడితే కబ్జా.. ఆ పై దర్జా
  • ప్రభుత్వస్థలం కనబడితే గద్దల్ల వాలిపోతున్న భూబకాసులు
  • స్మశానలను కూడా వదలని వైనం
  • అక్రమ లేఔట్లకు చిరునామా కారంపూడి
  • రియల్ ఎస్టేట్ పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనం
  • అక్రమ లేఔట్లు, భూకబ్జాల పై పట్టిపట్టనట్లు వ్యవహారిస్తున్న అధికారులు

 

పల్నాడు జిల్లా, కారంపూడి :  అది కారంపూడి … కార్యకలాపాలకు పుట్టిల్లు అది.. అందుగలడు ఇందులేడు ఏందేందు వెతికిన ఇంతటి కబ్జాదారులు లేరు అనడానికి నిదర్శనం ఇది. ఇక్కడ స్థలం కనబడితే చాలు గద్దల్ల వాలిపోతున్నారు. ఆ గద్దలకు అధికారులు రాబందుళ్ల నీడను ఇస్తూనే ఉన్నాయి పల్నాటి రణక్షేత్రమైన కారంపూడి మండలంలో ఖాళీ స్థలం కనబడితే గద్దల్ల వాలిపోతున్నారు భూబకాసులు. మండలంలో స్థలాల ధరలకు రెక్కలు రావటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ జోరుగా సాగుతుంది. అక్రమ లేఔట్లకు ప్రధాన కేంద్రంగా మారింది కారంపూడి మండలం. లేఔట్లు వేసే వారికీ ఎటువంటి అనుమతులు ఉండవు దర్జాగా లేఔట్లు వేస్తారు కోట్ల రూపాయలు వ్యాపారాలు నిర్వహించుకుంటారు. కారంపూడి మండలంలో మాచర్ల రోడ్డు ఒప్పిచర్ల పొట్టి శ్రీరాములు కాలనీ వద్ద మ్యాట్రిక్స్ ప్లాంట్ ఎదురు మరియు నరసరావుపేట రోడ్డు, పోతురాజుగుట్ట, మిట్టమీద ఆంజనేయస్వామి గుడి పరిసర ప్రాంతాలలో, కొదమగుండ్ల రోడ్డు, వినుకొండ రోడ్డు నందు ఇలా కారంపూడికి నాలుగు వైపులా అనుమతులు లేకుండా లేఔట్లు వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు మండల ప్రజలలో నెలకొని ఉన్నాయి. కనీసం ఒక లేఔట్ వేయలంటే పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకొని వారి వద్ద అనుమతి వచ్చిన తరువాత లేఓట్లు వేసుకోవాలి అలా కాకుండా అనుమతులు లేకపోయిన తమకేమిలే అన్నట్లుగా భూవ్యాపారులు ఇష్టనుసారంగా కారంపూడి మండలంలో లేఔట్ల రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా పంచాయతీ అధికారులు ఇతర శాఖ అధికారులు నిద్రపోతున్నారా అనే సందేహం ప్రజల్లో నెలకొని ఉంది. అంతేకాదు కారంపూడి మండలంలో ఖాళీ స్థలం కనబడింది అంతే రాత్రికి రాత్రే కబ్జా ఆపై ఆ స్థలాలను అమ్ముకొని ఇక్కడ కబ్జాదారులు దర్జాగా వ్యవహారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కారంపూడి మండలంలో నెలకు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న ఆదాయపన్ను శాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఆ దేవుడికే ఎరుక. గురజాల, పిడుగురాళ్ల సబ్ రిజిస్టర్ కార్యాలయలలో కారంపూడి మండల భూవ్యాపారాలకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్లను ఆదాయపన్ను శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే నల్ల ధనాన్ని తెల్ల ధనం చేసి ప్రభుత్వనికి ట్యాక్స్ లు కట్టకుండా అక్రమ వ్యాపారాలు నిర్వహించే నల్ల దొంగలు ఎందరో బయటపడతారు. మరోపక్క కారంపూడి మండలంలో ముఖ్యంగా కారంపూడిలో భూదందాలు ఎక్కువయ్యాయని ప్రచారం జోరుగా సాగుతుంది. ఖాళీ స్థలలనే కాకుండా స్మశాన స్థలాలను సైతం భూకబ్జా దారులు వదలటం లేదు ఇక్కడ కొంతమంది భూకబ్జా దారులకు స్థలం కనబడితే వారి కళ్ళు ఎర్రపడతాయి అన్నా ప్రచారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు స్థలాలు, దేవుడి స్థలాలు సైతం ఈ భూకబ్జాదారులు వదలటం లేదు అనే విషయం అక్షరసత్యంగా చెప్పవచ్చు. ఎవరికైనా ఖాళీ స్థలం ఉంటే భూకబ్జాదారుల దెబ్బకు ఖాళీ స్థలాల యజమానులకు నిద్ర పట్టటం లేదు. కొంతమంది ప్రైవేటు భూముల యజమానులు తమ స్థలాల వద్ద రాత్రి పూట పడుకొని తెల్లారి ఇంటికి వస్తున్న సంఘటనలు కూడా కారంపూడి మండలంలో దర్శనం ఇస్తున్నాయి. ముందు స్థలం కనబడితే ప్రాక్లేన్ పెట్టి బాగుచేయటం ఆ పై మట్టి తొలడం ఆ తరువాత దర్జాగా అమ్ముకోవటం. ఈ తంతు కారంపూడి మండలంలో జోరుగా సాగుతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరికొందరు అయితే ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి అధికారులను బెదిరిస్తు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్న ముఠా కూడా ఇటీవల కారంపూడిలో వెలసిందన్నా ప్రచారం కూడా ఇక్కడ వినిపిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ స్థలాలను బ్యాంకులలో తనఖా పెట్టి సొమ్ము చేసుకుంటున్న సంఘటనలు కూడా ఇటీవల మండలంలో ఒకటి రెండు దర్శనం ఇచ్చినట్లు తెలుస్తుంది. మండలంలో పేదవాడి సొంత ఇంటికల కలగానే మిగిలిపోతుంది. ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారాల ద్వారా కోట్లు సంపాదించిన కొందరు కోటీశ్వరులు పది రూపాయలు విలువ చేసే స్థలాన్ని వెయ్యి రూపాయలకు కొనుగోలు చేయటంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలోచ్చి పేదవాడు మాత్రం అద్దె ఇంటికే పరిమితం అవుతున్నాడు లేదా జగనన్న కాలనీలో స్థలం కోసం ఎదురుచూస్తున్నాడు. ఏది ఏమైనా అక్రమ లేఔట్లు, భూదందాలు ఖాళీస్థలాల కబ్జాలతో కారంపూడి మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతుంది. అక్రమ సంపాదకులు స్థలాల ధరలను భారీగా పెంచేస్తున్నారు. అంతేకాకుండా కారంపూడి మండలంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఇలాంటి అక్రమ వ్యాపారుల పై దాడులు చేస్తే కోట్ల రూపాయల నల్ల ధనం కారంపూడిలో బయటపడుతుంది. మరికొందరు అయితే కారంపూడి లో ధరలకు బయపడి ఇక్కడ కొనలేక పిడుగురాళ్ల, దాచేపల్లి పరిసరాలలో భూములను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ లేఔట్ల పై చర్యలు తీసుకొని భూకబ్జాలకు పాల్పడే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వవని మండల ప్రజలు భావిస్తున్నారు.

చెలరేగుతున్న భూ మాఫియా | A burgeoning land mafia-NGTS-Telangana

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :