పల్నాడు జిల్లా కారంపూడి: ఇటీవల కాలంలో డొంక పోరంబోకు భూములకు నో అబ్జెక్షన్(NOC) సర్టిఫికెట్ మాజీ పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథం ఇచ్చారన్న ఆరోపణలు రైతుల నుండి వినిపించడంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శి పై విచారణకు ఆదేశించినట్లు సమాచారం…? కొంతమంది సంబంధిత వ్యక్తుల ద్వారా పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథం భారీ మొత్తంలో డబ్బులు దండుకుని పూర్వీకుల ఆస్తి అని సర్టిఫికెట్ ఇవ్వడంతో కొంతమంది ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి రైతులు రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకొని రెవెన్యూ అధికారులకు, పత్రిక విలేకరుల ముందు చూపించారు.