మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం కారంపూడి పట్టణంలోని ₹40లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. అలాగే ఆదినారాయణ కాలనీలో ₹21.80 లక్షల రూపాయలు వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆదినారాయణ కాలనీలో C.M.D.F నిధుల ద్వారా 30లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా వేసిన సిసి రోడ్డు, ఆదినారాయణ కాలనీలో ₹20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించునున్న వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.