- శాంతిభద్రతలకు విగతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
- మీడియాతో కారంపూడి సిఐ దార్ల. జయకుమార్
పల్నాడు జిల్లా, కారంపూడి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కారంపూడి సర్కిల్ పరిధిలో కారంపూడి, రెంటచింతల, దుర్గి మండలాలకు సంబంధించి తర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు కారంపూడి సిఐ దార్ల. జయకుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్బంగా ప్రశాంత వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలని సభలు సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అలాగే మద్యం సేవించి బైకులు నడపడం, రోడ్ల పై తాగి గొడవ చేయడం వంటి కార్యక్రమలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి విన్యాసాలు చేస్తే అటువంటి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అలాగే శాంతిభద్రతలకు విగటం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కచ్చితంగా కేసులు పెట్టడం జరుగుతుందని అయన తెలిపారు. ప్రజలకు అసౌకర్యనికి గురిచేసిన చర్యలు తప్పవని నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అయన సూచించారు. రోడ్ల పై కేకులు కోయటం వాహనాలను ఆపడం వంటి సంఘటనలకు ఎవరు పాల్పడవద్దని అయన హేచ్చరించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా అయన హేచ్చరించారు.