- కారంపూడి విద్యుత్ శాఖ అధికారుల హదాహుడి అర్ధరాత్రి నోటీసులు అదికూడా తేదీలేకుండా దీని అంతర్యం ఏమిటి?
- బలవంతంగా నోటీసులు ఇవ్వాలని చూపిన సదరు విద్యుత్ అధికారులు బాదితలు నిరాకరించడంతో గోడకు నోటీస్ అంటించి వెళ్లిన విద్యుత్ శాఖ సిబ్బంది
- గతంతో పోలిస్తే రెండు నిండు ప్రాణాలు బలి కొని బలిగొన్న విద్యుత్ శాఖ నిర్లక్ష్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో దాచేపల్లి రోడ్ లోని కష్టాలగడ్డలొ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వింతలు విశేషాలు చోటుచేసుకున్నాయి ముఖ్యంగా విద్యుత్ శాఖ సామాన్యుల ప్రాణాలతో దోబూచులాడుతూ వస్తుందని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు సంవత్సరాల తరబడి ఇళ్లపై నుండి మరియు మధ్య నుండి విద్యుత్తు లైన్లు ఉండటం వలన ఆ ప్రాంత వాసులకు నిత్యం ప్రాణశకటంగా ఉంది గతంలో రాజారావు అనే వ్యక్తి ప్రస్తుతం బ్రహ్మానందరావు అనే వ్యక్తి ఇద్దరూ కూడా ఈ విద్యుత్తు లైను వల్లనే మృత్యువాత పడ్డారు. ఇంకొంతమంది గాయాలపాలు అయిన సంఘటనలు కూడ ఉన్నాయి. ఈ విద్యుత్తు తీగల గురించి ఆ ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందులు గురించి సంబంధిత విద్యత్ అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టీ పట్టనట్లు వ్యవహరించి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు . విద్యత్ గుత్తేదారులకు. (కాంట్రాక్టర్లు)అధికారులకు లాభసాటి పనులను అయితే తప్ప శ్రద్ధ వహిస్తారు గాని మిగతా వాటి గురించి పట్టించుకోరనీ ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల విద్యుత్ శాఖ తో బ్రహ్మానందరావు చనిపోయిన స్థలానికి సంబంధించి పెనుగొండ్ల శ్రీనివాసరావుకి విద్యుత్ అధికారులు. వారి తప్పిదం లేనట్టుగా బలవంతగా నోటీసులు ఇవ్వటానికి ప్రయత్నించగా శ్రీనివాసరావు కుటుంబసభ్యులు దానికి నిరాకరించటంతో అతను లేని సమయంలో వారి ఇంటి గోడకి కనీసం తేదీలు లేని నోటీసులు అంటించి విద్యుత్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు శ్రీనివాసరావు పశువుల పాక నిర్మించి సంవత్సరాలు గడిచిన ఆ సమయంలో ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు సరికదా ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా బలవంతగా నోటీసులు ఇవ్వటం వెనక ఆంతర్యం ఏమిటో అని ప్రజలు . ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు సదరు విద్యుత్ అధికారుల వాదన ఎలా ఉంది అంటే. లైన్లో మార్చాలి పోల్స్ మార్చాలి ఆంతే పోల్స్ వేరే కాలనీకి తరలించాలన్న ఆ కాలనీ ప్రజల నిరాకరిస్తూ వస్తున్నారని అందుకే జాప్యం జరిగిందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ పశువుల దొడ్డి యజమానికి గతంలోనూ నోటీసు ఇవచ్చు కదా అనేది ఆ కుటుంబ సభ్యుల కొత్త లైన్లు కొత్త స్తంభాల మాట దేవుడు అసలు రోడ్ మీద దాదాపు 7 అడుగుల కన్నా తక్కువ ఎత్తులోనే విద్యత్ తీగల కష్టాలగడ్డ లోని అన్ని బజార్లు దర్శనమిస్తాయి మరి వాటిని ఎందుకు ఇంతవరకు పట్టించుకోలేదు ఇదంతా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కాదా వాళ్ళ ఆ జాగ్రత్త వల్లనే రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ ఆ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.