పల్నాడు జిల్లా కారంపూడి : కరోనా మళ్ళీ విజ్రూంబిస్తుందని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కారంపూడి ఎస్ఐ ఎం. రామాంజనేయులు కోరారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలిస్ స్టేషన్ లో అయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ఫోర్త్ వేవ్ బిఎఫ్ 7 వెరీయంట్ మళ్ళీ విజ్రూంబిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి సామజిక దూరం పాటించాలని అయన కోరారు. అంతేకాకుండా షాపుల వద్ద గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవలసిన బాధ్యత వ్యాపారులదేనని శానిటైజర్ ద్వారా చేతులను శుభ్రపరుచుకోవాలని అయన సూచించారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించి కరోనా నిర్ములనకు కృషిచేయాలనీ అయన కోరారు.